![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -834 లో.. కావ్య తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చాలా ప్రేమ పెంచుకుంటుంది. అలా ఎందుకు పెంచుకుంటున్నావని రాజ్ అంటాడు. మన ప్రేమకి ప్రతిరూపం ఈ బిడ్డ.. ప్రేమ పెంచుకోకుండా ఎలా ఉంటానని కావ్య అంటుంది. మరొకవైపు సుభాష్, ప్రకాష్ ఇద్దరు ఆఫీస్ కి బయల్దేరి వెళ్తుంటే .. నా దిష్టి తగిలేలా ఉందని ఇందిరాదేవి అంటుంది.
అప్పుడే రుద్రాణి వచ్చి.. నా కొడుకు కి మాత్రం అన్యాయం జరుగుతుందని అంటుంది. రాహుల్ వచ్చి నాకు కంపెనీని చూసుకునే సామర్థ్యం లేదు మమ్మీ అని రాహుల్ తను మారిపోయినట్లు ఇంట్లో వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత కావ్య, రాజ్ హాస్పిటల్ కి వెళ్ళడానికి రెడీ అయి కిందకి వస్తారు. మొన్నే వెళ్లారు కదా మళ్ళీ ఎందుకని అపర్ణ వాళ్ళు అంటారు. వెళ్తే ఏంటి లోపల బేబీ కండిషన్ ఏంటో తెలుసుకోవాలి కదా అని రాజ్ అంటాడు.
కళ్యాణ్ లోపలికి రాగానే.. అసలు ఏం జరుగుతుంది బావకి నిజం చెప్పాక ఏం అన్నాడు నాకు ఏం చెప్పట్లేదని అప్పు అడుగుతుంది. కళ్యాణ్ సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత రాజ్ కావ్య హాస్పిటల్ కి వెళ్తారు. కావ్య బయట కూర్చొని ఉంటుంది. రాజ్ ఒక్కడే డాక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |